అమ్మాయిల పెళ్లి వయసు 18 కాదు 21... త్వరలోనే చట్ట సవరణకు కేంద్రం ప్లాన్...!

అమ్మాయిల పెళ్లి వయసు 18 కాదు 21... త్వరలోనే చట్ట సవరణకు కేంద్రం ప్లాన్...!

అమ్మాయిల కనీస వివాహ వయసు అంశంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది కేంద్ర ప్రభుత్వం. దేశంలోని అమ్మాయిల కనీస వివాహ వయసు 18 నుంచి 21 ఏళ్ళకు పెంచే దిశగా కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 2027 జనగణన లెక్కల ఆధారంగా మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తోంది కేంద్రం.

అయితే .. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వ్యే, శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వేలలో వెల్లడైన నివేదికల ఆధారంగా దేశంలో అమ్మాయిల సగటు వివాహ వయసు గత కొన్నేళ్లలో గణనీయంగా పెరిగింది. గతంలో 19.3గా అమ్మాయిల సగటు వివాహ వయసు 23.1 ఏళ్లకు పెరిగింది. పట్టణాల్లో అయితే...  అమ్మాయిల సగటు వివాహ వయసు 24.4 ఏళ్లుగా ఉందని సర్వేల్లో వెల్లడైంది.అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే.. 22.6 ఏళ్లుగా ఉన్నట్లు వెల్లడైంది.

►ALSO READ | 70 ఏళ్ల సీనియర్ CA.. "Hello... This is Divya" అని వాట్సాప్కు మెసేజ్.. ఆగలేక రిప్లై.. రూ.21 కోట్లు ఫట్ !

అమ్మాయిల కనీస వివాహ వయసు 18 ఏళ్ళు అయినప్పటికీ... ఉన్నత చదువులు, ఉద్యోగాల పట్ల అమ్మాయిలు ఆసక్తి చూపుతున్న క్రమంలో పెళ్లిళ్లు ఆలస్యం అవుతున్నాయి. అమ్మాయిల పెళ్లి వయసు పురుషులతో సమానంగా... 21 ఏళ్లకు పెంచేందుకు 2021లోనే బిల్లు ప్రవేశపెట్టింది మోడీ సర్కార్. ఆ బిల్లు పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉండగా 17వ లోక్ సభ రద్దు కావడంతో అక్కడితోనే ఆగిపోయింది.

ఈ క్రమంలో 2027 జనగణన ప్రక్రియ పూర్తయ్యాక వచ్చే అధికారిక జనాభా లెక్కల ఆధారంగా బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తోంది కేంద్రం. లింగ సమానత్వం, మహిళల ఆరోగ్యం, పోషకాహార లోపాల నివారణ వంటి అంశాల్లో ఈ బిల్లు తోడ్పడుతుందని భావిస్తోంది కేంద్రం.