రెండేళ్ల లోపు ఉన్న పిల్లలకు పీడియాట్రిక్ కాఫ్ సిరప్‌లను ప్రిస్క్రైబ్ చేయడాన్ని నిషేధించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆలోచిస్తోంది. అదే విధంగా ఐదేళ్ల లోపు పిల్లలకు వాటి వాడకాన్ని కూడా తగ్గించాలని ప్రతిపాదించింది. ఇండియన్ ఫార్మకోపీయా కమిషన్ విడుదల చేసిన నేషనల్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎఫ్‌ఐ) 2026 డ్రాఫ్ట్‌లో ఈ ప్రతిపాదనలు పొందుపరిచింది.
ఈ డ్రాఫ్ట్ ప్రకారం, రెండు సంవత్సరాల లోపు పిల్లలకు కాఫ్, కోల్డ్ మెడికేషన్లను ప్రిస్క్రైబ్ చేయకూడదు లేదా ఇవ్వకూడదు అని స్పష్టంగా పేర్కొంది. ఐదేళ్ల లోపు పిల్లలకు ఈ మందులు సాధారణంగా సిఫార్సు కూడదని పేర్కొంది. ఒకవేళ అవసరమైతే తప్ప జాగ్రత్తగా క్లినికల్ ఎవాల్యుయేషన్‌తో, డాక్టర్ సిఫారసుతో మాత్రమే వాడాలని సూచించింది.
►ALSO READ | నోయిడా నుంచి ఢిల్లీ, ఫరీదాబాద్ కు వ్యాపించిన కార్మికుల ఆందోళనలు : కార్మికుల పోరాటానికి కారణం ఇదీ..!
2025లో కొన్ని కాఫ్ సిరప్‌లలో డైఎథైలీన్ గ్లైకాల్ (DEG), ఎథైలీన్ గ్లైకాల్ (EG) వంటి విషపూరిత పదార్థాలు ఉండటంతో పిల్లల మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ కొత్త మార్గదర్శకాలు రూపొందించారు. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతిపాదనలను ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు స్వాగతిస్తున్నారు. పిల్లల్లో దగ్గు అనేది సహజంగా వాళ్లలో ఉండే రక్షణ వ్యవస్థ ప్రతిస్పందన మాత్రమేనని అంటున్నారు. బ్యాక్టీరియా, వైరస్ లు ప్రవేశించినప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ ప్రతిస్పందిస్తుంది. సిరప్‌లు వినియోగిస్తే తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఉంటుంది కానీ లాభం ఉండదు. దీనికి తోడు రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. కాఫ్ సిరఫ్ వాడటం వలన రిస్క్ మాత్రం ఎక్కువ అని అంటున్నారు.
మందుల తయారీదారులు ఇప్పటికే గ్లిసరిన్, ప్రొపైలీన్ గ్లైకాల్ వంటి హై-రిస్క్ ఎక్సిపియెంట్స్‌ను ప్రతిపాదించిన మేరకు మాత్రమే వినియోగించాలని పేర్కొన్నారు. ప్రతి బ్యాచ్‌ను కఠినంగా పరీక్షించాలని కొత్త ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. దీనిపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. తల్లిదండ్రులు రెండేండ్లలోపు పిల్లలకు ఏ కాఫ్ సిరప్‌లు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. కాఫ్ వచ్చినప్పుడు డాక్టర్ సలహా తీసుకోవడమే మంచిది.
