తెలంగాణలో సామాజిక న్యాయంసాధించి తీరుతం: కవిత

తెలంగాణలో సామాజిక న్యాయంసాధించి తీరుతం: కవిత
  • బీసీలకు 50 %  రిజర్వేషన్లు ఇచ్చే వరకు పోరాటం ఆగదు: కవిత
  •     వేల కార్లతో ‘చలో ఢిల్లీ’ పేరిట భారీ యాత్ర చేపడుతామని వెల్లడి
  •     సరూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్  ఇండోర్ స్టేడియంలో తెలంగాణ సామాజిక న్యాయ సంకల్ప సభ

ఎల్బీనగర్, వెలుగు: తెలంగాణలో సామాజిక న్యాయం సాధించి తీరుతామని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) పార్టీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సరూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ సామాజిక న్యాయ సంకల్ప సభ నిర్వహించారు. 

ఇందులో కవిత మాట్లాడుతూ.. సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం చేపట్టిన సామాజిక న్యాయ సంకల్ప సభ దేశంలోని కోట్లాది మంది జీవితాల్లో మార్పు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. బీసీల కోసం మాట్లాడితే తాను అగ్రవర్ణానికి చెందిన మహిళనని విమర్శిస్తున్నారని, అయితే పుట్టుక తన చేతిలో లేకపోయినా ఎవరి కోసం పనిచేయాలో నిర్ణయించుకోవడం మాత్రం తన చేతుల్లోనే ఉందని అన్నారు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం సాధించే వరకు తన జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పారు. సభలో పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమం కొనసాగించడం, మహాత్మా జ్యోతిబాఫూలే, -సావిత్రిబాయి ఫూలే దంపతులకు భారత రత్న ఇవ్వడం, ప్రొఫెసర్ జయశంకర్‌‌కు పద్మ విభూషణ్ ప్రదానం చేసి ట్యాంక్‌‌బండ్‌‌పై విగ్రహం ఏర్పాటు చేయడం, ఎస్సీ-, ఎస్టీ నిధులను వారి అభ్యున్నతికే వినియోగించడం, బ్యాక్‌‌లాగ్ పోస్టులను భర్తీ చేయడంలాంటి అంశాలను తీర్మానాల్లో చేర్చారు. గ్రామ స్థాయి నుంచి సామాజిక న్యాయ ఉద్యమాన్ని విస్తరించి, అవసరమైతే దేశ రాజధానిలో భారీ ఉద్యమానికి శ్రీకారం చుడతామని కవిత ప్రకటించారు. 

కుల వివక్ష కొనసాగుతోంది..

రాజ్యాంగం సమానత్వాన్ని కల్పించినప్పటికీ సమాజంలో కులవివక్ష ఇంకా కొనసాగుతున్నదని కవిత వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం అంటే ఒక వర్గానికి నష్టం చేయడం కాదని, ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పించడమేనని వివరించారు. బీసీలకు ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే రాజకీయ సాధికారత అవసరమని, బీసీ రిజర్వేషన్ బిల్లును వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే వెయ్యి కార్లతో ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఆదివాసీలకు అడవులపై సంపూర్ణ హక్కులు కల్పించాలని, ముస్లింలకు హక్కులతో కూడిన రిజర్వేషన్లు అమలు చేయాలని, మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కవిత కోరారు. ట్రాన్స్‌‌జెండర్లు, దివ్యాంగులు, సిక్కులు, క్రిస్టియన్ల హక్కుల పరిరక్షణకు కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.