నేడు(ఆగస్టు 7) బెంగళూరులో జాతీయ ఓబీసీ మహాసభ...అటెండ్ కానున్న కర్నాటక సీఎం డీకే శివకుమార్, కేంద్ర మంత్రులు

నేడు(ఆగస్టు 7) బెంగళూరులో జాతీయ ఓబీసీ మహాసభ...అటెండ్ కానున్న కర్నాటక సీఎం డీకే శివకుమార్, కేంద్ర మంత్రులు

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఓబీసీలను ఏకం చేసే లక్ష్యంతో నేడు బెంగళూరు సిటీ యూనివర్సిటీలో జాతీయ ఓబీసీ మహాసభ నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ మహాసభకు కర్నాటక సీఎం డీకే శివకుమార్, కేపీసీసీ ప్రెసిడెంట్ హరిప్రసాద్, కేంద్ర మంత్రులు, ఎంపీలు, వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 5 వేల మంది ఓబీసీ ప్రతినిధులు అటెండ్ కానున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. 

మహాసభ ఏర్పాట్లను గురువారం జాజుల శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. మండల్ కమిషన్ సిఫార్సుల అమలు తేదీగా గుర్తింపు పొందిన ఆగస్టు 7న దేశంలోని ప్రతి రాష్ట్రంలో జాతీయ ఓబీసీ మహాసభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. గత పదేళ్లుగా ఏపీ నుంచి యూపీ వరకు వివిధ రాష్ట్రాల్లో ఈ మహాసభలు నిర్వహిస్తున్నామని, ఈసారి కర్నాటకలోని బెంగళూరులో నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కర్నాటక రాష్ట్ర అధ్యక్షుడు కుర్ర లక్ష్మణ్, ఏపీ అధ్యక్షుడు శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.