జోహన్నెస్‌బర్గ్: సౌతాఫ్రికాలో టీమిండియా విమెన్స్ జట్టు పర్యటన షెడ్యూల్‌ను సవరించారు. ఇప్పటికే ఖరారైన ఒక టెస్ట్, మూడు వన్డేలతోపాటు అదనంగా మూడు టీ20 మ్యాచ్‌లను ఈ టూర్‌లో చేర్చారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 9 నుంచి 12 వరకు ఏకైక టెస్ట్, 16 నుంచి 22 వరకు మూడు వన్డేలు జరుగుతాయి.
26 నుంచి 30 వరకు మూడు టీ20లు ఆడనున్నారు. అదనపు మ్యాచ్‌ల వల్ల ఇండియా జట్టు సౌతాఫ్రికాలో వారం రోజులు ఎక్కువగా ఉండనుంది. బెనోనీ, పొట్చెఫ్‌స్ట్రూమ్‌లో టీ20లు జరుగుతాయి. ఫిబ్రవరిలో లంక వేదికగా ప్రారంభం కానున్న తొలి విమెన్స్ చాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమయ్యేందుకు ఈ మ్యాచ్‌లు రెండు జట్లకు సరైన వేదికగా నిలుస్తాయని క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్‌ఏ) సీఈవో ఫోలెట్సి మోసెకి పేర్కొన్నాడు.
