ఫీజు బకాయిల పేరుతో సర్టిఫికెట్లు ఆపొద్దు..జాహ్నవి డిగ్రీ కాలేజీకి హైకోర్టు ఆదేశాలు

ఫీజు బకాయిల పేరుతో సర్టిఫికెట్లు ఆపొద్దు..జాహ్నవి డిగ్రీ కాలేజీకి హైకోర్టు ఆదేశాలు
  • విద్యార్థుల ఒరిజినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వాలని స్పష్టం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పోస్టుమెట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బకాయిలు ఉన్నాయన్న కారణంతో విద్యార్థుల ఒరిజినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్లను కాలేజీలు నిలిపివేయరాదని హైకోర్టు స్పష్టం చేసింది. నల్లకుంటలోని జాహ్నవి డిగ్రీ కాలేజీ విద్యార్థుల సర్టిఫికెట్లన్నింటినీ వెంటనే తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. గతంలోనూ సర్టిఫికెట్లు అప్పగించాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా.. వాటిని అమలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని నల్లకుంట పోలీసులను సుమోటోగా ప్రతివాదులుగా చేర్చింది. సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన షేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముత్తాహిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు మరో ఇద్దరు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.వి.శ్రవణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విచారణ చేపట్టారు. ఫీజు బకాయిలు ఉన్నాయంటూ పదో తరగతి పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మార్కుల మెమో, ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్టడీ, బోనఫైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితర ధ్రువపత్రాలను కాలేజీ యాజమాన్యం ఇవ్వడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఎమ్మెస్సీ బయాలజీలో సీటు వచ్చినా.. ఒరిజినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్లు లేకపోవడంతో ప్రవేశం కోల్పోయే పరిస్థితి ఉందని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందేనని ఉన్నత విద్యామండలి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ల ఒరిజినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్లను వెంటనే వాపసు చేయాలని జాహ్నవి డిగ్రీ కాలేజీని ఆదేశించారు. కోర్టు ఉత్తర్వులు అమలయ్యేలా నల్లకుంట ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.