ముషీరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్బకాయిల విడుదల కోసం ఎస్‌ఎఫ్‌ఐ, జనసేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్క్వద్ద వేర్వేరుగా ధర్నాలు నిర్వహించారు. హలో విద్యార్థి–చలో హైదరాబాద్ పేరుతో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో రాష్ట్ర కమిటీ సభ్యులు కె.వై.ప్రణయ్, ఆకారపు నరేశ్, అక్బర్, నాగకృష్ణ, లెనిన్ గువేరా తదితరులు మాట్లాడుతూ.. 14 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయడం లేదన్నారు. బీఆర్ఎస్హయాంలో రూ.4 వేల కోట్లు ఉంటే కాంగ్రెస్వచ్చిన తర్వాత రూ.6,400 కోట్లకు పెరిగాయని తెలిపారు.
బకాయిలు విడుదల చేయాలి
పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్బకాయిలను వెంటనే విడుదల చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ఇన్చార్జి నేమూరి శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు మిరియాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో విద్యార్థి పోరు దీక్ష నిర్వహించారు. విద్యార్థుల ప్రాణత్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో కనీసం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.
