నెస్లే పాలపొడి అమ్మకాలపై నిషేధం.. ఆరోగ్యానికి ప్రమాదకరమని తేల్చిన FSSAI

నెస్లే పాలపొడి అమ్మకాలపై నిషేధం.. ఆరోగ్యానికి ప్రమాదకరమని తేల్చిన FSSAI

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నెస్లే లో ఫ్యాట్ డైరీ వైట్నర్పై నిషేధం విధించింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని ఒక హోటల్‌ నుంచి సేకరించిన నెస్లే లో ఫ్యాట్ డైరీ వైట్నర్ శాంపిల్స్ను పరీక్షించిన తర్వాత అది సురక్షితం కాదని FSSAI ప్రకటించింది. ఫాస్ఫరస్ స్థాయిల్లో హెచ్చుతగ్గుల కారణంగా నెస్లే లో ఫ్యాట్ డైరీ వైట్నర్ ఆరోగ్యానికి ప్రమాదకరమని తేల్చింది.

ఆరోగ్య భద్రతా ప్రమాణాలకు తగిన విధంగా ఈ ఉత్పత్తి లేదని FSSAI కనుగొంది. పాలలో సహజంగా ఉండే ఫాస్ఫరస్‌ను ఈ పరీక్షలో వేరు చేసి చూపలేదని, తమ ఉత్పత్తి సురక్షితమని, నిబంధనలకు అనుగుణంగానే ఉందని నెస్లే వాదించింది. నెస్లే ఉత్పత్తులపై ఈ మధ్య కాలంలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పాటించడం లేదని తీవ్ర స్థాయిలో ఆరోపణలొచ్చిన సంగతి తెలిసిందే.