సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మ్యాడ్ సంధు (మధుసూదన్)ను పంజాబ్లోని అమృత్ సర్లో కాల్చి చంపేశారు. ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి నడిరోడ్డుపై అతనిపై కాల్పులు జరిపి అక్కడ నుంచి పారిపోయారు. రక్తపు మడుగులో తీవ్ర గాయాలతో బాధపడుతున్న మ్యాడ్ సంధును స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
अमृतसर में इन्फ्लुएंसर मैड संधू की गोली मारकर हत्या!
— Kishor Joshi (@KishorJoshi02) October 3, 2026
अमृतसर में एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां पॉपुलर मेकअप आर्टिस्ट और सोशल मीडिया इन्फ्लुएंसर मैड संधू को गोली मार दी गई. गंभीर हालत में अस्पताल ले जाते वक्त उनकी मौत हो गई. #MadSandhu #Amritsar #Influencer #Punjab… pic.twitter.com/RDuBZQv4ip
అయితే.. ఆసుపత్రికి తీసుకెళ్ల లోపే అతని ప్రాణం పోయింది. మ్యాడ్ సంధు అసలు పేరు మధుసూదన్. మేకప్ ఆర్టిస్ట్‌గా, ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తున్నాడు. కొన్ని పంజాబీ సినిమాల్లో కూడా నటించారు. LGBTQ+ హక్కుల గురించి బహిరంగంగా మాట్లాడటంతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు.
ఇన్ స్టాగ్రాంలో అతనికి 2 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. సుమారు మూడు నెలల క్రితం సంధు, నిహంగ్ సిఖ్ నాయకుడు జాతేదార్ మన్‌ప్రీత్ సింగ్ ఖల్సా మధ్య గొడవ జరిగింది. మ్యాడ్ సంధు కంటెంట్ పంజాబ్ సంస్కృతిపై, అక్కడి యువతపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని నిహంగ్ వర్గం సంధును హెచ్చరించింది.
నిహాంగ్ వర్గానికి చెందిన సభ్యులు సంధు వేషధారణ, సోషల్ మీడియా కార్యకలాపాలు, పాత వీడియోలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే.. తన జీవితంలో తనను తాను మార్చుకోవడంలో ఎలాంటి తప్పు లేదని, తాను ఇలానే ఉంటానని సంధు కూడా ధీటుగా బదులిచ్చాడు. ఈ వివాదమే సంధు హత్యకు దారి తీసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
