వయసు 30 దాటిందా..? గుండెపోటు వచ్చే రిస్క్ ఉందేమో.. ఇలా తెలుసుకోండి..!

వయసు 30 దాటిందా..? గుండెపోటు వచ్చే రిస్క్ ఉందేమో.. ఇలా తెలుసుకోండి..!

ఇండియాలో ప్రస్తుతం సగటు మనిషి ఆయుష్షు 70 సంవత్సరాలు. 30 దాటాయంటే సగం ఆయుష్షు తీరిపోయినట్టే. ఈరోజుల్లో మారిన ఆహారపు అలవాట్లు, జీవన శైలి, నిద్ర లేమి కారణంగా గుండెపోటు ఎప్పుడు అటాక్ చేస్తుందో తెలియడం లేదు. అందువల్ల.. 30 ఏళ్లు దాటాక తప్పనిసరిగా కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవడం మేలు అని వైద్యులు సూచిస్తున్నారు.

రక్తపోటు, కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర, మూత్రపిండాల పనితీరును క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం చాలా అవసరం. సమతుల్య ఆహారం, శారీరక శ్రమ, ధూమపానం మానేయడం, మంచి నిద్ర, ఒత్తిడిని తట్టుకునేలా జీవనశైలిలో మార్పులు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వ్యాధిని ముందుగానే గుర్తించడం వల్ల అపాయం నుంచి బయటపడొచ్చు.

ఇతర దేశస్తులతో పోలిస్తే భారతీయులకు గుండె జబ్బులు తక్కువ వయసులోనే వచ్చే అవకాశం ఉందని అగిలస్ డయాగ్నోస్టిక్స్ స్ట్రాటజిక్ బిజినెస్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ అజయ్ ఫడ్కే అన్నారు. భారతీయ పురుషులలో గణనీయమైన సంఖ్యలో గుండెపోటు సంభవిస్తుందని.. 50 ఏళ్ల వయస్సు రాకముందే సంభవిస్తున్నాయని డేటా స్పష్టం చేసిందని ఆయన చెప్పారు. 

లిపిడ్ ప్రొఫైల్ అనేది మొత్తం కొలెస్ట్రాల్, LDL, HDL, ట్రైగ్లిజరైడ్‌లను అంచనా వేస్తుంది. ఇదే కాకుండా.. లిపోప్రొటీన్(ఎ), లేదా ఎల్‌పి(ఎ) అనేది మరో టెస్ట్. జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా ఈ టెస్ట్ చేయించుకోవాలని డాక్టర్ ఫడ్కే చెప్పారు.