బర్త్ టూరిజంపై అమెరికా డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సిటిజెన్ షిప్ కోసం అమెరికాకు వచ్చి పిల్లల్ని కంటున్న వారిని లక్ష్యంగా చేసుకొని రెండు కొత్త ఎగ్జిక్యూటివ్ ఫైల్స్ పై సంతకం చేశారు. కొత్త రూల్స్ అమలులోకి వస్తే.. టూరిజం పేరుతో అమెరికాలోకి వచ్చి పిల్లల్ని కంటే వారికి అమెరికా పౌరసత్వం వర్తించదు. గతంలో అమెరికా పౌరసత్వంపై ట్రంప్ నిర్ణయాలను ఆదేశ సుప్రీంకోర్టు తిరస్కరించిన తర్వాత తాజాగా ట్రంప్ ఈ కొత్త నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
విదేశీయుల అమెరికా పౌరసత్వంపై ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బర్త్ రైట్ సిటిజన్ షిప్ నిబంధనలను మరింత కఠిన తరం చేస్తూ రెండు కొత్త ఎగ్జిక్యూటివ్ ఫైల్స్ పై సంతకం చేశారు ట్రంప్. గతంలో ఈ నిర్ణయాన్ని అమెరికా సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్దమని చెప్పినా ఈ సారి కొత్త విధానంతో బర్త్ టూరిజం కట్టడికి చర్యలు చేపట్టారు ట్రంప్.
కొందరు విదేశీయులు తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం రావాలనే ఉద్దేశంతో అక్కడి వెళ్లి డెలివరీలు చేయించుకుంటున్నారని అమెరికా వర్గాలు ఆరోపిస్తున్నారు. అలాంటి వారిని బర్త్ రైట్ సిటిజన్ షిప్ సౌకర్యాన్ని రద్దు చేసే లక్ష్యంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కొత్త ఉత్తర్వుల ప్రకారం.. కేవలం పిల్లలకు సిటిజన్ షిప్ కోసం అమెరికాకు వెళ్లే విదేశీయుల పిల్లలు, అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు వంటి కొన్ని ప్రత్యేక వర్గాలకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. ఇది రాజ్యాంగ విరుద్దం కాదని వైట్ హౌస్ చెబుతోంది. అయితే ఈ నిర్ణయంపై మళ్లీ కోర్టులో కేసులు పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బర్త్ టూరిజం అంటే..
ప్రెగ్నెన్సీతో ఉన్న విదేశీ మహిళలు టూరిజంపై అమెరికాకు వచ్చి పిల్లల్ని కనడం బర్త్ టూరిజం. ఇవి అమెరికాలో పెరిగిపోతున్నాయని పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పరిమితం చేయడం లక్ష్యంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్ 2020ప్రకారం..2016 నుంచి 2027 మధ్య కాలంలో కేవలం ఒక సంవత్సర కాలంలో 20 వేలనుంచి 25 మంది మహిళలు బర్త్ సర్టిఫికెట్ కోసం అమెరికా వచ్చారు. 2025 నాటికి అమెరికాలో 36 లక్షల జననాలు నమోదయ్యాయి.
బర్గ్ టూరిజం , సిటిజన్ షిప్ పై ట్రంప్ మాట్లాడుతూ..పుట్టుకతో వచ్చే పౌరసత్వం నిబంధనను కొందరు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని అన్నారు. ఈ విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు.
మరోవైపు, అమెరికా సుప్రీంకోర్టు మాత్రం 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అమెరికాలో జన్మించిన వారికి పౌరసత్వ హక్కు ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ హక్కు అమెరికా రాజ్యాంగం కల్పించిన ముఖ్యమైన హక్కుల్లో ఒకటని కోర్టు తెలిపింది. దీంతో ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందా? లేక కోర్టు మరోసారి అడ్డుకుంటుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
