చారిత్రక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి రూపొందించిన యానిమేషన్ చిత్రం ‘సర్దార్ సర్వాయి పాపన్న’. డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా వచ్చే వారం థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి మాట్లాడుతూ ‘పాపన్న 376వ జయంతి ఉత్సవాల సందర్భంగా సినిమాను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని అన్నారు. పాపన్న చరిత్రను ఏఐ, యానిమేషన్ రూపంలో ప్రేక్షకులకు అందించడం ఈ చిత్ర ప్రత్యేకత అని నిర్మాణ పర్యవేక్షకులు దీపక్ న్యాతి చెప్పారు.
