అన్షు, వాసవి గణేషన్ జంటగా బిక్షు దర్శకత్వంలో వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న చిత్రం ‘హుషారు పిట్టలు’. ఆగస్టు 15న సినిమా విడుదల కానుంది. ఏషియన్, సురేష్ ఫిలింస్ సంస్థలు విడుదల చేస్తున్నాయి. తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమా ఇది. పతాక సన్నివేశాలు అందరి హృదయాలను హత్తుకుంటాయి.
అవుట్‌పుట్‌పై నమ్మకంతోనే పెద్ద సినిమాల మధ్యలో విడుదల చేస్తున్నాం’ అని చెప్పారు. దర్శకుడు కావాలన్న తన డ్రీమ్ ఈ చిత్రంతో నెరవేరిందని, ఈనెల 10న వస్తున్న ట్రైలర్‌తో అంచనాలు పెరుగుతాయని బిక్షు అన్నాడు. ఈ సినిమా అందరి హృదయాలను హత్తుకుంటుందని హీరో హీరోయిన్ చెప్పారు. టీజర్, పాటల తరహాలో సినిమా కూడా అందరికీ నచ్చేలా ఉంటుందని నిర్మాత వెంకట్ యాదవ్ అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.
