ICC టెస్ట్ ర్యాంకింగ్స్: మెరుగైన స్థానాల్లో కేఎల్ రాహుల్, సిరాజ్

ICC టెస్ట్ ర్యాంకింగ్స్: మెరుగైన స్థానాల్లో కేఎల్ రాహుల్, సిరాజ్

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సెల్(ICC) తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌, స్టార్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌  మెరుగైన స్థానాలను దక్కించుకున్నారు. లేటెస్టుగా ఇంగ్లండ్‌తో ముగిసిన రెండో టెస్ట్‌లో 8 వికెట్లతో మ్యాచ్‌ విన్నింగ్‌ ప్రదర్శన కనబర్చిన సిరాజ్‌.. 465 రేటింగ్ పాయింట్స్‌తో ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 38వ స్థానంలో నిలిచాడు.

మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీతో అదరగొట్టిన కేఎల్‌ రాహుల్‌ 19 స్థానాలు మెరుగుపరుచుకుని 37వ ర్యాంక్‌ ను దక్కించుకున్నాడు. ఇక వరుసగా రెండు టెస్ట్‌ల్లో విఫలమైనా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన 5వ స్థానాన్ని నిలబెట్టుకోగా.. తొలి ఇన్నింగ్స్‌లో ఆఫ్ సెంచరీతో రాణించిన రోహిత్‌ శర్మ(6వ ర్యాంక్‌) ర్యాంక్‌ మెరుగుపరుచుకోకపోయినా కెరీర్ బెస్ట్ 773 రేటింగ్ పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.