రాజేంద్రనగర్ పీఎస్కు మొదటి స్థానం..ఎందులో తెలుసా..?

రాజేంద్రనగర్ పీఎస్కు మొదటి స్థానం..ఎందులో తెలుసా..?

  సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్లలో మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా వివిధ అంశాల్లో పోలీస్ స్టేషన్ల పనితీరు ప్రామాణికంగా  కేంద్ర హోంశాఖ నిర్వహించిన సర్వేలో రాజేంద్రనగర్  పోలీస్ స్టేషన్ అత్యుత్తమ  ప్రతిభ కనబరిచింది. కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదవుతున్న పోలీస్ స్టేషన్గా రాజేంద్రనగర్ రికార్డ్ సృష్టించింది. 

నమోదైన కేసుల విచారణ, హత్య కేసులో అతి త్వరగా నిందితుల గుర్తింపు, అనేక కేసులను ఛేదించడంలో అత్యంత ఉత్తమ ప్రతిభను కనబరిచినందుకు గాను దేశంలోనే నెంబర్ -1  రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ ను ఎంపిక చేశారు.  దేశంలో అత్యంత ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ స్టేషన్లో రాజేంద్రనగర్కు మొదటి స్థానం లభించడంతో రాజేంద్రనగర్ సీఐ నాగేంద్రబాబు ఈనెల 5న జయపురలో జరిగే కార్యక్రమంలో అవార్డు తీసుకోనున్నారు.