హాకీలో విజయంపై షారుక్ ఖాన్ ట్వీట్ వైరల్

హాకీలో విజయంపై షారుక్ ఖాన్ ట్వీట్ వైరల్

ఒలింపిక్స్ లో భారత మహిళల హాకీ జట్టు విజయంపై బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనదైన శైలిలో స్పందించాడు. తాను నటించిన సూపర్ హిట్ సినిమా ‘‘చక్ దే ఇండియా’’ ను గుర్తు చేస్తూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో షారుక్ కోచ్ కబీర్ ఖాన్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. హాకీ మహిళా టీమ్‌ను ప్రపంచ విజేతగా నిలపడంలో విజయవంతం అయిన కోచ్‌గా షారుక్‌ ఖాన్ ఆ సినిమాలో నటించాడు.
నిన్న టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్ లో భారత మహిళల హాకీ జట్టు సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది. అపూర్వ విజయం దేశ వ్యాప్తంగా కొత్త ఉత్సాహాన్నిచ్చింది. విజయం అనంతరం మహిళల హాకీ చట్టు కోచ్ జార్డ్ మోర్నీ తన కుటుంబ సభ్యుల కోసం  ట్వీట్ చేశారు. ‘‘సారీ ఫ్యామిలీ.. నేను మళ్లీ లేటుగా వస్తున్నా..’’ అని కామెంట్ చేస్తూ..  బస్సులో తన జట్టుతో కలసి వెళ్తున్న ఫోటోను జత చేశాడు. 

కోచ్ ట్వీట్ కు షారుక్ ఖాన్ తన దైన శైలితో స్పందింస్తూ.. ‘‘సరే సరే..నో ప్రాబ్లమ్‌.. కాకపోతే వచ్చే టపుడు కొంచెం బంగారం తీసుకుని రా... ఇక్కడ వంద కోట్ల కుటుంబం ఎదురు చూస్తోంది.. పైగా నవంబర్‌ 2న ధన్‌తెరస్‌ పండుగ వస్తోంది... ఫ్రం.. కోచ్‌ కబీర్‌ ఖాన్‌' అంటూ కామెంట్‌ రాశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సినీ, క్రీడా అభిమానులు కామెంట్లు.. రీట్వీట్లతో స్పందిస్తూ ఆనందాన్ని పంచుకుంటున్నారు.