నాకు 44 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది: శరద్ పవార్

నాకు 44 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది: శరద్ పవార్

ఎన్సీపీని పునర్నిర్మిస్తానన్నారు  ఆ పార్టీ అధినేత షరద్ పవార్ .  తన అన్న కొడుకు అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత ఇవాళ షరద్ పవార్  పార్టీ నేతలతో  సమావేశం అయ్యారు.  తనకు గురువు అయిన  మహారాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి యశ్వంతరావు చవాన్‌కు గురుపౌర్ణమి  సందర్బంగా సతారా జిల్లాలోని కరాడ్‌లోని అతని స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించారు. అనంతరం తన మద్దతుదారులతో బలప్రదర్శన ప్రదర్శించారు. తనకు 44 మంది ఎమ్మెల్యేల బలం ఉందన్నారు శరద్ పవార్. బీజేపీ అన్ని ప్రతిపక్ష పార్టీలను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తోందని..ఎన్సీపీని  పునర్నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ప్రస్తుతం మహారాష్ట్రలో, దేశంలో కొన్ని వర్గాలు కులం పేరుతో, మతాల పేరుతో సమాజంలో చీలిక సృష్టిస్తున్నాయన్నారు. తిరుగుబాటుదారులు తిరిగి రావొచ్చని.. అయితే దానికి టైం పడుతుందన్నారు.  ఎన్సీపీని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించిన వారికి తామేంటో చూపిస్తామన్నారు. అజిత్ పవార్ తిరుగుబాటుతో తాను అధైర్యపడలేదని.. మళ్లీ  ప్రజల మధ్యకు వెళ్తానని చెప్పారు.

జూలై 2న షరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్ తిరుగుబాటు చేశారు. 8 మంది కీలక నేతలతో బీజేపీతో చేతులు కలిపారు. సీఎం ఏక్ నాథ్ షిండే వర్గంలో చేరారు.  డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ , ఆయనతో పాటు వెళ్లిన 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.