125 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియా

125 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియా

దుబాయ్: టీ20 వరల్డ్ కప్ లో చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లంతా తక్కువ స్కోరుకే పెవిలియన్ తిరుగుముఖం పట్టడంతో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 125 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్గెన్ అరోన్ ఫించ్ (44) ఒక్కడే ఒంటరిపోరాటం చేయడం వల్ల ఆమాత్రం స్కోర్ చేయగలిగింది. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వరుసగా ఈ మ్యాచ్ లోనూ విఫలమయ్యాడు. 
ఆరంభంలోనే ఆసీస్ కు షాక్
తొలి ఓవర్ తర్వాత ఆస్ట్రేలియా జట్టు వరుసగా వికెట్లు పోగొట్టుకుని కష్టాల్లో చిక్కుకుంది. రెండో ఓవర్లోనే ఓపెనర్ డేవిడ్ వార్నర్ 1 పరుగు చేసి పెవిలియన్ బాట పట్టగా.. మూడో ఓవర్ మరో వికెట్... నాలుగో ఓవర్లో ఇంకో వికెట్ కోల్పోయింది. 5 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ స్కోర్ 3 వికెట్లు కోల్పోయి 17పరుగులు చేసింది. కీలక వికెట్లు పడిపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైన అసీస్ బ్యాటర్లపై ఇంగ్లీష్ బౌలర్లు పట్టు బిగించారు. దీంతో ఆస్ట్రేలియా 15 ఓవర్లు ముగిసినా 67 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఐదు వికెట్లు కోల్పోయింది. 

అయితే అరోన్ ఫించ్ అడపా.. దడపా బ్యాట్ ఝుళిపిస్తుండడంతో మ్యాచ్ పై ఆశపెట్టుకున్న ఆసీస్ జట్టుకు ఇంగ్లీష్ బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో పరుగులు తీసే ఒత్తిడిలో పడి ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోయింది. నిర్ణీత 20 ఓవర్లకు 125 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు పడగొట్టగా వోక్స్, మిల్స్ చెరి రెండు చొప్పున వికెట్లు తీశారు. అలాగే లివింగ్ స్టోన్, ఆదిల్ చెరో వికెట్ పడగొట్టారు.