న్యూఢిల్లీ: ఇండియా స్టార్ షూటర్ ఇషా సింగ్.. ఒలింపిక్ సెలెక్షన్ ట్రయల్స్–2లోనూ సత్తా చాటింది. శనివారం జరిగిన విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ఇషా 244.9 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. 3.1 పాయింట్లు తక్కువ సాధించిన రిథమ్ రెండో ప్లేస్ సాధించింది. మెన్స్10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో అర్జున్ సింగ్ చీమా 244.6 పాయింట్లతో తొలి స్థానం సంపాదించాడు. రవీందర్ (242.4), వరుణ్ తోమర్ వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచారు.
