- తీర్పు అనంతరం ఫార్మాలిటీస్ పూర్తి చేసిన మాజీ ఎంపీ
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇటీవల క్లీన్ చిట్ పొందిన మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ సీబీఐ స్పెషల్ కోర్టుకు హాజరయ్యారు. కేసు నుంచి విముక్తి పొందిన నేపథ్యంలో కోర్టుకు సంబంధించిన అధికారిక ఫార్మాలిటీస్‌ను ఆమె పూర్తి చేశారు.
గత నెల 27న రౌస్ ఎవెన్యూ కోర్టు కవితతో పాటు అర్వింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా సహా మరో 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది. తీర్పు వెలువడిన తర్వాత నిందితులు కొన్ని కీలక పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుంది.
