ఖమ్మం టౌన్, వెలుగు: జూనియర్ మ్యాథ్స్ ఒలింపియాడ్ ఎగ్జామ్ లో హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ జాతీయ స్థాయిలో ప్రతిభ చాటినట్లు హార్వెస్ట్ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల యాజమాన్యం బుధవారం తెలిపింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాథమేటిక్స్ ఎడ్యుకేషన్, థానే వారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన ఎగ్జామ్ లో హార్వెస్ట్ స్టూడెంట్స్ విశేష ప్రతిభ కనబర్చి, సెకండ్ లెవల్ లో 13 మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించినట్లు తెలిపారు.
ఫిబ్రవరి 2న దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఈ ఎగ్జామ్ లో 51మంది స్టూడెంట్స్ సెకండ్ లెవల్ లో పాల్గొనగా, బుధవారం విడుదలైన రిజల్ట్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మెడల్స్ సాధించిన వారిలో కె.కృష్ణ, సూచేత్, వి.రోహన్ వంశీ, ఎన్.లలిత్, జి.విరాట్ కార్తీక్, పి.గౌతమ్ శ్రీనివాస్, వి.రాజ్ కుమార్, జి.అద్విక్ రెడ్డి ఉన్నారు.
సిల్వర్ మెడల్ సాధించిన వారిలో బి.సాయి దియా, కె.తన్వి సింగ్, వై.నిరూపమ్, మరో ముగ్గురు కన్సోలేషన్ బహుమతులు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా హార్వెస్ట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవి మారుత్, ప్రిన్సిపాల్ ఆర్.పార్వతి రెడ్డి స్టూడెంట్స్ ను అభినందించారు. కార్యక్రమంలో ఐఐటీ బ్రాంచ్ ఇన్చార్జిలు జి.ఉమామహేశ్వరరావు, కె.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
