సురేఖ గోల్డెన్ హ్యాట్రిక్

సురేఖ గోల్డెన్ హ్యాట్రిక్
  •     ఆర్చరీ వరల్డ్ కప్‌‌‌‌లో 3 గోల్డ్ మెడల్స్‌‌‌‌ సొంతం

షాంగై:  ఇండియా స్టార్ ఆర్చర్‌‌‌‌‌‌‌‌, తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఆర్చరీ వరల్డ్ కప్‌‌‌‌ స్టేజ్‌‌‌‌1లో మూడు గోల్డ్ మెడల్స్‌‌‌‌తో హ్యాట్రిక్ సాధించింది. ఈ ఘనత సాధించిన రెండో ఇండియన్‌‌‌‌గా  నిలిచింది. 2021జూన్‌‌‌‌లో దీపికా కుమారి పారిస్‌‌‌‌లో జరిగిన వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ స్టేజ్‌‌‌‌3లో తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ గెలిచింది. శనివారం జరిగిన విమెన్స్ కాంపౌండ్‌‌‌‌ ఫైనల్లో మూడో ర్యాంకర్ సురేఖ 146–-146 (9*–9) టాప్ సీడ్‌‌‌‌ ఆండ్రీ బెకెరాపై గెలిచింది.

ఫైనల్‌‌తో పాటు  షూటాఫ్‌‌‌‌ లోనూ ఇద్దరు ఆర్చర్లు సమంగా నిలిచారు. అయితే, జ్యోతి చివరి బాణం ఇన్నర్‌‌‌‌‌‌‌‌ రింగ్‌‌‌‌కు దగ్గరగా దిగడంతో ఆమెనే విజయం వరించింది. విమెన్స్‌‌‌‌ టీమ్ ఫైనల్లో జ్యోతి, ఆదితి స్వామి, పర్ణీత్ కౌర్‌‌‌‌‌‌‌‌తో కూడిన ఇండియా 236–225 స్కోరుతో ఇటలీని చిత్తు చేసింది. మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ టీమ్ ఈవెంట్‌‌‌‌లో రెండో సీడ్ జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ 158–157తో ఇస్తోనియాకు చెందిన లిసెల్ జాట్మా–రాబిన జాట్మాను ఓడించారు. ఇక, మెన్స్‌‌‌‌ కాంపౌండ్ ఫైనల్లో అభిషేక్, ప్రియాన్ష్‌‌‌‌, ప్రథమేశ్‌‌‌‌తో కూడిన ఇండియా 238–231తో నెదర్లాండ్స్‌‌‌‌ జట్టును ఓడించింది. మెన్స్ వ్యక్తిగత విభాగంలో ప్రియాన్ష్‌‌‌‌ సిల్వర్ గెలిచాడు.