
చెంగ్డు (చైనా): థామస్, ఉబెర్ కప్‌లో ఇండియా బ్యాడ్మింటన్ జట్లు శుభారంభం చేశాయి. ఉబెర్ కప్ గ్రూప్–ఎలో విమెన్స్ టీమ్ 4–1తో కెనడాను ఓడించింది. తొలి సింగిల్స్‌లో యంగ్‌స్టర్ అష్మితా చాలిహా 26-–24, 24-–22 తో వరల్డ్ 25వ ర్యాంకర్ మిషెల్లీ లీని ఓడించి సంచలనం సృష్టించింది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో సింగపూర్‌తో అమ్మాయిలు పోటీపడతారు. మరోవైపు థామస్ కప్ గ్రూప్–సిలో మెన్స్ టీమ్ 4–1తో థాయ్‌లాండ్‌పై విజయం సాధించింది. సోమవారం జరిగే తర్వాతి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో మెన్స్ టీమ్ పోటీపడుతుంది.