డేటింగ్ మాతో.. వెడ్డింగ్ మోదీతో! మాజీ ప్రధాని దేవెగౌడపై ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు

డేటింగ్ మాతో.. వెడ్డింగ్ మోదీతో! మాజీ ప్రధాని దేవెగౌడపై ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: రాజ్యసభలో మాజీ ప్రధాని, జేడీఎస్​నేత హెచ్​డీ దేవెగౌడపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. దేవెగౌడ ఎన్డీయే కూటమితో చేతులు కలపడంపై ఖర్గే తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ‘‘దేవెగౌడతో నాకు 54 ఏండ్లుగా పరిచయం ఉంది. చాలా కాలం కలిసి పనిచేశాం. ఆ తర్వాత ఏమైందో తెలియదు.. ఆ తర్వాత అధికార పార్టీతో చేతులు కలిపారు. ‘వో మొహబ్బత్ హమారే సాత్ కియే.. షాదీ మోదీ సాహబ్ కే సాత్’ అని చమత్కరించారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ సహా సభలోని సభ్యులందరూ బిగ్గరగా నవ్వారు. 2018లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో జేడీఎస్, కాంగ్రెస్​ పొత్తుపెట్టుకొని కలిసి పోటీచేశాయి. ఆ తర్వాత కొంత కాలానికి ఎన్డీయేతో జేడీఎస్​ పొత్తు పెట్టుకుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతున్నది. ఈ పరిణామాలపైనే దేవేగౌడపై ఖర్గే వ్యాఖ్యలు చేశారు.