నాది 'బలవంతపు పెళ్లి' అందుకే విడాకులు ఇచ్చా: దేవెగౌడ

నాది 'బలవంతపు పెళ్లి' అందుకే విడాకులు ఇచ్చా: దేవెగౌడ

న్యూఢిల్లీ:  "ప్రేమ మా మీద, పెళ్లి మాత్రం మోదీ గారితోనా?" అంటూ.. రాజ్యసభలో బుధవారం కాంగ్రెస్ చీఫ్ ఖర్గే చేసిన కామెంట్లపై జేడీఎస్ చీఫ్ దేవెగౌడ అదే తరహాలో స్పందించారు. "కాంగ్రెస్‌తో నాది ఒక 'బలవంతపు పెళ్లి'. ఆ బంధంలో వేధింపులు భరించలేకే 'విడాకులు' ఇచ్చాను" అని ట్వీట్ చేశారు. 

2018 కర్నాటక ప్రభుత్వ ఏర్పాటు, 2019లో  కూలిపోయిన తీరును గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీయే కూటమి నుంచి తప్పుకుందని, దాంతో తనకు ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సి వచ్చిందన్నారు.