ఉగాది రోజున కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. 5 నిమిషాల్లో రూ.14 లక్షల కోట్లు ఆవిరి

ఉగాది రోజున కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. 5 నిమిషాల్లో రూ.14 లక్షల కోట్లు ఆవిరి

భారత స్టాక్ మార్కెట్లు ఉగాది పండుగ రోజున భారీ నష్టాలతో తమ ప్రయాణాన్ని స్టార్ట్ చేశాయి. ఉదయం మార్కెట్లు ఓపెన్ అవ్వగానే జస్ట్ 5 నిమిషాల్లో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1625 పాయింట్లకు పైగా నష్టాల్లోకి జారుకోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 470 పాయింట్ల వరకూ నష్టంతో ప్రయాణిస్తున్నాయి. ఇక నిఫ్టీ బ్యాంక్ సూచీ 1490 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1092 పాయింట్ల నష్టంతో ఉదయం 9.22 గంటల సమయంలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. 

మార్కెట్లను ప్రస్తుతం భయపెడుతున్న అంశం క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలగా తెలుస్తోంది. ఇదే క్రమంలో విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్ల నుంచి ఈ నెల మెుదటి 15 రోజుల కాలంలోనే దాదాపు రూ.31వేల కోట్లను వెనక్కి తీసుకోవటం దేశీయ మార్కెట్లపై ఒత్తిడిని పెంచేస్తోంది. ఇక పండుగ పూట గ్లోబల్ మార్కెట్లలో కొనసాగిన అమ్మకాల జోరు దేశీయ ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను దెబ్బతీసిందని నిపుణులు చెబుతున్నారు. ఇంట్రాడేలో బ్యాంకింగ్, ఆటో రంగాలకు చెందిన షేర్లు నష్టాలతో సూచీలను కిందికి లాగుతున్నాయి ప్రధానంగా.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ గ్యాస్ ఉత్పత్తి చేసే రాస్ లఫాన్ ప్లాంట్ ఇరాన్ మిస్సైన్ దాడులతో భారీగా దెబ్బతిన్నట్లు ఖతార్ ప్రకటించటం కూడా మార్కెట్లను భయంలోకి నెట్టేసింది. ఇప్పటికే ఇండియాలో గ్యాస్ కష్టాలు భారీగా పెరగగా.. దిగుమతుల ఆలస్యానికి తోడు ఉత్పత్తి ప్లాంట్లలో నష్టాలతో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవటానికి చాలా కాలం పడుతుందనే నిజాలు మార్కెట్లను ఆందోళనకు గురిచేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.