మొయినాబాద్ డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డిని కావాలనే ఇరికించిన్రు : బీఆర్ఎస్ నాయకులు

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డిని కావాలనే ఇరికించిన్రు : బీఆర్ఎస్ నాయకులు
  •     రీటెస్ట్ చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్

తాండూర్, వెలుగు: మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసేందుకే కావాలని ఇరికించారని తాండూరు పట్టణ బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ మాట్లాడుతూ.. పార్టీలో 11 మంది పాల్గొంటే కేవలం ముగ్గురిపైనే కేసు నమోదు చేయడం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. 

15న పార్టీ జరిగితే, అంతకుముందు రోజైన 14వ తేదీనే కేసు నమోదు చేయడం, రోహిత్ రెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకోవడం చూస్తుంటే ఇది రాజకీయ కక్షసాధింపు చర్యగా స్పష్టమవుతోందని మండిపడ్డారు. ఈ కేసులో వెంటనే రీటెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రవీందర్ రెడ్డి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.