డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ తయారీలోకి అమర రాజా గ్రూపు

డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ తయారీలోకి అమర రాజా గ్రూపు

న్యూఢిల్లీ: అమర రాజా గ్రూపు అనుబంధ సంస్థ అమర రాజా డిజైన్ ఆల్ఫా డిఫెన్స్‌ ఎలక్ట్రానిక్స్ విభాగంలోకి ప్రవేశించింది. నావికా దళ సోనార్ వ్యవస్థల కోసం పవర్ కండిషనింగ్ క్యాబినెట్ రూపొందించింది. ఇందులో 61 శాతం స్వదేశీ పరికరాలను ఉపయోగించింది. దీనివల్ల తయారీ ఖర్చు 40 శాతం వరకు తగ్గుతుందని సంస్థ తెలిపింది.

భారత నావికా దళ బడ్జెట్ 2020-21లో రూ.49,623 కోట్లు ఉండగా 2025-–26 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.1,03,548 కోట్లకు పైగా పెరిగింది. సముద్ర గర్భ నిఘాలో సోనార్ వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. భవిష్యత్తులో పవర్ యాంప్లిఫైర్లు సిగ్నల్ ఇంటర్ ఫేస్ ల తయారీ పై దృష్టి పెడతామని ఏఆర్​డీఏ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నాయర్ తెలిపారు.