‘ఉస్తాద్ భగత్ సింగ్‌‌’ లాంటి ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌ వచ్చి చాలా కాలమైంది: హరీష్ శంకర్

‘ఉస్తాద్ భగత్ సింగ్‌‌’ లాంటి ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌ వచ్చి చాలా కాలమైంది: హరీష్ శంకర్

పవన్  కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌‌ నిర్మించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్‌‌’ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రీ రిలీజ్‌‌ ప్రెస్‌‌మీట్‌‌లో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ ‘అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఒక బిగ్ స్టార్‌‌‌‌ నుంచి కమర్షియల్‌‌ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌ ఈ మధ్య కాలంలో రాలేదని నా ఫీలింగ్. 

పాటలు, ఫైట్‌‌లు, డ్యాన్స్‌‌లు, పంచ్‌‌ డైలాగ్‌‌లు, లవ్‌‌, కామెడీ, విలన్‌‌ లాంటి అన్ని కమర్షియల్‌ అంశాలు ఉన్న సినిమా ఇది. ఎలాంటి రికార్డులు క్రియేట్‌‌ చేస్తుందో చెప్పలేను కానీ సినిమా చూశాక ఇలాంటి ఎంటర్‌‌‌‌టైనింగ్‌‌ సినిమా వచ్చి చాలాకాలం అయిందని మాత్రం అనుకుంటారు. అభిమానులు మళ్ళీ మళ్ళీ చూస్తారు. పవన్ కళ్యాణ్ గారి నుంచి కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉండి.. పూర్తిస్థాయి పవర్‌‌‌‌ స్టార్ సినిమా చూశామనే సంతృప్తిని ఇస్తుంది’ అని చెప్పారు.  

హీరోయిన్ రాశి ఖన్నా మాట్లాడుతూ ‘ఈ ఏడాది నాకిది తొలిచిత్రం. ఉగాదికి వస్తోంది.  పైగా పవన్‌‌ కళ్యాణ్​ గారి సినిమా.  అందుకే ఇది నాకు ట్రిపుల్‌‌ సెలబ్రేషన్‌‌.   సినిమా అందరికీ నచ్చుతుంది’ అని చెప్పింది.  మరో హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ ‘ఒక మంచి తెలుగు సినిమా ఉగాదికి వస్తోంది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. సినిమాపై ఫుల్‌‌ కాన్ఫిడెన్స్‌‌గా ఉన్నాం’ అని చెప్పింది. 

నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ ‘పవన్‌‌ కళ్యాణ్ గారితో సినిమా చేయాలన్న కోరిక ఈ చిత్రంతో నెరవేరడం సంతోషంగా ఉంది.  డిప్యూటీ సీఎంగా ఆయన విధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా హరీష్‌‌ శంకర్‌‌‌‌ షెడ్యూల్స్‌‌ ప్లాన్ చేసి షూటింగ్ పూర్తి చేశారు. ఇదొక పూర్తిస్థాయి ఎంటర్‌‌టైనర్. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటుంది’ అని చెప్పారు.