మేం కూడా మాస్కు పెట్టుకుంటాం..

మేం కూడా మాస్కు పెట్టుకుంటాం..

కరోనా నుంచి కాపాడుకునేందుకు మీరే కాదు.. మేం కూడా మాస్కుపెట్టుకుంటాం’ అంటోంది ఈ కోతి. రోడ్డుపైన ఆడుకుంటున్న ఒక కోతికి మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దొరికింది. దాన్ని చూడగానే అది తీసుకుని ఠక్కున ముక్కుకు పెట్టేసుకుంది. కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత అది జారిపోతే మళ్లీ తీసి నీటుగా మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చెవులకు పెట్టుకుని వెళ్లిపోయింది. రెండేండ్ల నుంచి జనాలు మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పెట్టుకోవడం బాగా అబ్జర్వ్​ చేసినట్లుంది. అందుకే, 
మనుషుల్లాగానే అది కూడా మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుకుని తిరిగింది. ఆ వీడియో ఎవరో తీసి సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో పెట్టడంతో నెట్టింట్లో తెగ వైరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యింది. నెటిజన్లు ఆ వీడియోపై తెగ కామెంట్లు పెడుతున్నారు. చాలామంది దాన్ని షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ‘కోతులకు ఉన్న తెలివి మనుషులకు లేదు’ అంటూ మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరిగ్గా పెట్టుకోని వాళ్లకు చురకలంటిస్తున్నారు.