Asia Cup Final 2023: కప్పు కొట్టాలి.. టీమిండియాకి ఆల్ ది బెస్ట్: టాలీవుడ్ హీరో

Asia Cup Final 2023: కప్పు కొట్టాలి.. టీమిండియాకి ఆల్ ది బెస్ట్: టాలీవుడ్ హీరో

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కి క్రికెట్ మీద ఎంత ఇష్టమో తెలిసిందే. సినిమాలతో పాటు క్రికెట్ ని కూడా అమితంగా ఆరాధించే వెంకీ.. భారత్ ఎప్పుడు మ్యాచులాడినా అక్కడ ఈలలు వేస్తూ.. సపోర్ట్ ఇస్తాడు. ముఖ్యంగా హైదరాబాద్ లో మ్యాచ్ జరిగితే చాలు అక్కడ వాలిపోతూ ఉంటాడు. కాసేపట్లో భారత్, శ్రీలంక మధ్య ఆసియా కప్ ఫైనల్ కొలొంబోలో జరుగుతుండగా వెంకీ మామ టీమిండియాకి విషెస్ తెలియజేశాడు.

కప్ ఇంటికి తీసుకొని రండి
  
”బ్లూ జెర్సీలో ఉన్న మా అబ్బాయిలందరికీ చీరింగ్. ఫైన‌ల్‌లో గెలిచి కప్పును ఇంటికి తీసుకురండి కెప్టెన్” అంటూ వెంకటేష్‌ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. దీనితో పాటు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌తో దిగిన ఫొటోను పంచుకున్నాడు. ఇక మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉండ‌గా.. గత ఐదేండ్లలో ఒక పెద్ద టోర్నీ ఫైనల్ కి రావడం ఇదే తొలిసారి. చివరిసారిగా భారత జట్టు 2018 ఆసియాకప్‌ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై గెలిచి ట్రోఫీ అందుకుంది. అప్పుడు కెప్టెన్ కూడా రోహిత్ శర్మ కావడం విశేషం.