
- దేశ సంపదపై కన్నేసే జాతీయ రాజకీయాల్లోకి పోతుండు
- ప్రజాసమస్యలు లేవనెత్తకుండా ప్రతిపక్షాల గొంతునొక్కారని ఫైర్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీపై సీఎం కేసీఆర్తప్పుడు కూతలు కూశారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన కేసీఆర్.. దేశాన్ని ఎలా ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. దేశ సంపదపై కన్నేసే బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆదివారం ప్రకటనలో ఆయన ఆరోపిం చారు. అసెంబ్లీలో అప్రాప్రియేషన్బిల్లుపై సమా ధానం ఇవ్వాల్సిన కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానిని విమర్శించడానికే ప్రాధాన్యం ఇచ్చా రని ఫైర్ అయ్యారు. ప్రధానిపై విమర్శలు చేసేం దుకు అసెంబ్లీని వేదికగా చేసుకోవడం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమేనని అన్నారు. రాష్ట్రంలోనే 24 గంటల కరెంట్ఇవ్వలేకపోతున్న కేసీఆర్.. దేశమంతా 24 గంటల కరెంట్ ఎలా ఇస్తారో? ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాలనను గాలికొదిలేసిన కేసీఆర్.. దేశానికి ఏం చేస్తారు? అని ప్రశ్నించారు.
కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే..
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వడం లేదని, వాళ్లు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని వివేక్ మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మినహా ప్రజలంతా ఇబ్బందుల్లోనే ఉన్నారు. కానీ ప్రతిపక్షాలు అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తకుండా అధికార పార్టీ సభ్యులు గొంతు నొక్కారు. రాష్ట్రంలో అసలు సమస్యలే లేవనట్టుగా మభ్య పెట్టే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ సాక్షిగా మంత్రి జగదీశ్‌రెడ్డి రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇవ్వలేకపోతున్నామని చెప్తే.. నిరంతరాయంగా కరెంట్ ఇస్తున్నామని సీఎం చెప్పడం సిగ్గుచేటు. అసెంబ్లీ వేదికగా ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలిస్తున్నామని చెప్తున్నారు. ఇంతకు మించిన అబద్ధం ఇంకొకటి లేదు. పైగా తాను చెప్పినవి అబద్ధమైతే రాజీనామా చేస్తానని కేసీఆర్చెప్పడమే అతిపెద్ద అబద్ధం. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సందర్భాలు లేనేలేవు” అని విమర్శించారు. కేసీఆర్తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు.