Ritu Varma: గోపీచంద్ 33లో సత్యవతిగా రీతూ వర్మ.. విల్లు పట్టిన వీరనారి లుక్‌ అదిరిపోయిందిగా!

Ritu Varma: గోపీచంద్ 33లో సత్యవతిగా రీతూ వర్మ.. విల్లు పట్టిన వీరనారి లుక్‌ అదిరిపోయిందిగా!

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపిచంద్ టాలెంటెడ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'G33'.  'ఐబి71', 'ఘాజీ', 'అంతరిక్షం' వంటి చిత్రాలతో తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన సంకల్ప్ రెడ్డి, ఈసారి భారతదేశ చరిత్రలో మరుగున పడిపోయిన ఒక వీరోచిత ఘట్టాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్‌డేట్ వెలువడింది.

సత్యవతిగా రీతూ వర్మ.!

ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న టాలెంటెడ్ బ్యూటీ రీతూ వర్మ పుట్టినరోజు (మార్చి 10) సందర్భంగా మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రీతూ వర్మ ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. చేతిలో విల్లు, బాణం పట్టుకుని, తీక్షణమైన చూపులతో లక్ష్యాన్ని గురిపెడుతున్న ఆమె లుక్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ఆమె 'సత్యవతి' అనే కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకునే రీతూ వర్మకు, 'సత్యవతి' పాత్ర కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

యదార్థ గాథతో..

దర్శకుడు సంకల్ప్ రెడ్డి గత చిత్రాల తరహాలోనే ఈ సినిమా కూడా ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌తో రాబోతోంది. ఇప్పటివరకు భారతీయ వెండితెరపై చర్చకు రాని, చరిత్ర పుస్తకాల్లో దాగి ఉన్న ఒక యదార్థ గాథను ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నారు. ఈ భారీ బడ్జెట్ పీరియడ్ డ్రామా కోసం గోపీచంద్ తన లుక్ మార్చడమే కాకుండా, ప్రత్యేకంగా యుద్ధ విద్యల్లో శిక్షణ కూడా తీసుకున్నారు. గోపీచంద్ మార్క్ యాక్షన్, సంకల్ప్ రెడ్డి మార్క్ మేకింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

►ALSO READ | Ustaad Bhagat Singh: 'కాలర్ ఎత్తరా'సాంగ్ ప్రోమో రిలీజ్.. జీరో కట్స్‌తో మాస్ జాతరకు పవర్ స్టార్ రెడీ!

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తున్నారు. సాంకేతికంగా అత్యున్నత విలువలతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ మూవీ టైటిల్, విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. మొత్తానికి, 'సత్యవతి'గా రీతూ వర్మ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. మ్యాచో స్టార్ ఈ సినిమాతో మళ్ళీ ఫామ్‌లోకి వస్తాడో లేదో చూడాలి!