ఏపీలో వెయ్యి దాటిన కరోనా కేసులు

ఏపీలో వెయ్యి దాటిన కరోనా కేసులు

అమరావతి: ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన ఒక రోజులోనే కొత్తగా 61 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1016కు చేరుకుంది. ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు లేని శ్రీకాకుళం జిల్లాలో శనివారం మూడు కేసులు నమోదయినట్లు అక్కడి ఆరోగ్య శాఖ బులిటెన్​లో వెల్లడించింది. ఇవాళ కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో మరొకరు కరోనా ట్రీట్​మెంట్ పొందుతూ చనిపోయినట్లు తెలిపింది. దీంతో రాష్ట్రంలో వైరస్ బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 31 కి పెరిగింది. ఇప్పటివరకు 171 మంది రోగులు కోలుకుని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్‌ కాగా.. రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో 814 మందికి ట్రీట్​మెంట్ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 6,928 మంది నుంచి శాంపిల్స్ సేకరించినట్లు బులిటెన్ లో పేర్కొంది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 275 కేసులు, గుంటూరు జిల్లాలో 209 కేసులు నమోదైనట్లు తెలిపింది.