V6 News

వాహనాలను ఢీకొట్టిన ట్రక్కు..బొలెరోలో మంటలు.. 11 మంది సజీవ దహనం

వాహనాలను ఢీకొట్టిన ట్రక్కు..బొలెరోలో  మంటలు..  11 మంది సజీవ దహనం

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది.  డ్రామాండ్‌గంజ్ లోయ సమీపంలో ఓ ట్రక్కు అదుపు తప్పి వాహనాలను ఢీ కొట్టడంతో 11 మంది సజీవ దహనం అయ్యారు.

అసలేం జరిగిందంటే..ఏప్రిల్ 22 న రాత్రి 8.30 గంటలకు  డ్రామాండ్‌గంజ్ లోయ నుంచి కిందికి దిగుతున్న ఒక భారీ ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ఈ ఘోరం జరిగింది. అదుపు తప్పిన ఆ ట్రక్కు ముందు వెళ్తున్న కంటైనర్‌ను బలంగా ఢీకొట్టింది. అదే సమయంలో ఈ రెండు వాహనాల మధ్య ఒక ఆల్టో కారు నలిగిపోయింది. అంతేగాకుండా వెనుక నుంచి వస్తున్న  బొలెరో కారు కూడా ఈ వాహనాలను ఢీకొట్టింది. సెకన్ల వ్యవధిలోనే బొలెరోలో మంటలు చెలరేగడంతో అందులోని ప్రయాణికులు బయటకు వచ్చే అవకాశం లేక అందులోనే సజీవదహనం అయ్యారు.  స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

 ఈ ప్రమాదంలో గాయపడిన ట్రక్కు డ్రైవర్ ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉంది. ప్రమాదానికి గురైన వాహనాలు బీహార్, మధ్యప్రదేశ్, స్థానిక జిల్లాలకు చెందినవిగా గుర్తించారు. ప్రస్తుతం ఆ మార్గంలో ట్రాఫిక్‌ను పునరుద్ధరించే పనులు జరుగుతున్నాయి. అధికారులు  మృతదేహాలను గుర్తించే పనిలో ఉన్నారు.