డ్రోన్ కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్…చర్లపల్లి జైలుకు తరలింపు

డ్రోన్ కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్…చర్లపల్లి జైలుకు తరలింపు

మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డినికి ఉప్పర్‌పల్లి మేజిస్ట్రేట్‌ 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో ఆయనను పోలీసులు భారీ బందోబస్తు నడుమ చర్లపల్లి జైలుకు తరలించారు. చేవేళ్ల నియోజకవర్గం జన్వాడలోని కేటీఆర్ ఫాంహౌజ్ పై డ్రోన్ కెమెరాను వాడారనే ఫిర్యాదుతో ఎంపీ రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. ఎయిర్ లైన్స్ యాక్ట్ కు విరుద్దంగా డ్రోన్ కెమెరాతో కేటీఆర్ ఫామ్ హౌజ్ ను షూట్ చేశారని కేసు రిజిస్టర్ చేశారు.

ఈ కేసుకు సంబంధించి సెక్షన్‌ 184, 187, 11 రెడ్‌ విత్‌ 5A, రెడ్‌క్రాఫ్ట్‌ యాక్ట్‌ కింద రేవంత్‌ రెడ్డితో సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే వీరిలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రేవంత్‌ రెడ్డి, కృష్ణారెడ్డి ఆదేశాలతోనే వీరు డ్రోన్‌ ఎగరవేసినట్టు పోలీసులు తేల్చారు.