ICFAI యూనివర్సిటీ యాసిడ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు

 ICFAI యూనివర్సిటీ యాసిడ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు

రంగారెడ్డి:శంకర్పల్లిలోని  ICFAI యూనివర్సిటీలో యాసిడ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు విద్యార్థిని లేఖ్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మోకీల పోలీసులు విచారణ చేస్తున్నారు. యాసిడ్ కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల లేఖ్య అనే బీటెక్ చదువుతున్న విద్యార్థిని శరీరం కాలింది. తీవ్రగాయాల య్యాయి. చికిత్స కోసం ఆమెను అపోలో ఆస్పత్రికి తరలించారు.  విషయం తెలుసుకున్న పోలీసుు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరాతీ స్తు న్నారు. 

ఈ ఘటన గురువారం (మే 16) మధ్యాహ్నంచోటు చేసుకుంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు లేఖ్య స్నానం చేసే బకెట్ లో యాసిడ్ పోయడంతో ఆమె గమనించలేదు. అదే బకెట్ లో నీటితో స్నానం చేయడంతో ఈ సంఘటన జరిగింది.  ఇది గమనించిన తోటి విద్యార్థినిలు, యూనివర్సిటీ సిబ్బంది  లేఖ్య ను ఆపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం లేఖ్య కు చికిత్స జరుగుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.