గోకుల్ చాట్ పేలుళ్లకు 14 ఏళ్లు..

గోకుల్ చాట్ పేలుళ్లకు 14 ఏళ్లు..

గోకుల్ చాట్, లుంబిని పార్క్ జంట పేలుళ్లకు నేటితో 14 ఏళ్ళు పూర్తయ్యాయి. ఏండ్లు గడిచినా నాటి గాయాలు మాత్రం మానలేదు. ఆగస్టు 25, 2007న హైదరాబాద్ లో జంట పేలుళ్లు జరిగాయి. ఈ జంట పేలుళ్లలో మొత్తం 44 మంది మృతిచెందగా.. వందలాది మంది గాయాలపాలయ్యారు. ఇండియన్ ముజాహిద్ధిన్ ఉగ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు కుట్ర పన్నింది. ఈ కేసులో A1గా ఉన్న అనిక్ షఫిక్ సయ్యద్, A 2గా ఉన్న అక్బర్ ఇస్మాయిల్ చౌదరి అనే ఇద్దరు ఉగ్రవాదులకు చర్లపల్లి ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష ఖరారు చేసింది. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన తారిఖ్ అంజుమాకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. కాగా.. నిందితులకు ఉరిశిక్ష విధించి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు అమలు కాకపోవడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను వెంటనే ఉరి తీయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఘటన జరిగి 14 ఏళ్లు గడిచినా బాధితులకు సహాయం అందకపోవడం గమనార్హం.