తమిళులు ఈజిప్ట్‌లో చిక్కుబడిపోయారు. లగ్జర్ సిటీకి సమీపంలోని నైలు నదీ తీరంలో వాళ్లు ప్రయాణిస్తున్న షిప్పును అక్కడి అధికారులు ఆపేశారు. తమిళనాడుకు చెందిన 17 మంది చిక్కుకున్నారు. ఇప్పటికే ఆ షిప్పులో ఉన్న 12 మంది సిబ్బందితో పాటు 33 మంది ప్యాసింజర్లకు కొవిడ్ పాజిటివ్ గా తేలింది. చెన్నైకి చెందిన ఓ వ్యక్తిని శనివారం అలెగ్జాండ్రియాలోని హాస్పిటల్ కు తరలించారు. టూర్ లో భాగంగా సేలంకు చెందిన గ్రాండ్ రాయల్ టూర్స్‌కు చెందిన షిప్పులో ఫిబ్రవరి 27న బయల్దేరినట్టు తమిళనాడుకు చెందిన వనిత అనే మహిళ తెలిపింది. మార్చి 7న తిరిగి ఇండియాకు రావాల్సి ఉండగా, కొవిడ్ నేపథ్యంలో ఈజిప్ట్‌లో క్వారెంటైన్ చేశారని చెప్పింది. షిప్పులో టైంకు తిండి పెట్టట్లేదని, ఈజిప్ట్‌లోని ఇండియన్ ఎంబసీకి ఇప్పటికే సమాచారమిచ్చామని తెలిపింది. శాకాహారం ఇవ్వాల్సిందిగా షిప్ క్రూను కోరినట్టు చెప్పింది. స్టెరిలైజేషన్ కోసం షిప్పులోని కిచెన్ ను మూసేశారని, బయటి నుంచి ఫుడ్డు తెస్తున్నారని ఆవేదన చెందింది.
