కొనుగోలు సెంటర్లు ఎత్తేస్తే..మహిళా సంఘాలకు ఏటా 200 కోట్ల నష్టం

కొనుగోలు సెంటర్లు ఎత్తేస్తే..మహిళా సంఘాలకు ఏటా 200 కోట్ల నష్టం
హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: పంట కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తామన్న రాష్ట్ర సర్కార్ నిర్ణయంతో ఐకేపీ మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున నష్టం రానుంది. ఈ సెంటర్ల నిర్వహణ ద్వారా వచ్చే కమీషన్లతో ఇన్నేండ్లు నడిచిన సంఘాలు.. ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఈ సెంటర్లపై ఆధారపడిన వేలాది మంది మహిళలు ఉపాధి కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే రాష్ట్ర సర్కార్ ఇచ్చే పావలా వడ్డీ లోన్లు సరిగా రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంఘాలు… కొనుగోలు సెంటర్లు మూసేస్తే ఏటా రూ.200 కోట్ల వరకు ఆదాయాన్ని కోల్పోనున్నాయి. మరోవైపు ఒక్కో ఐకేపీ సెంటర్ లో బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ట్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంట్రీ ఆపరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కమిటీ సభ్యులు ఐదుగురు చొప్పున ఏడెనిమిది మంది పని చేస్తారు. ఇప్పడు వీళ్లందరూ ఉపాధి కోల్పోనున్నారు. ఒక్కో సెంటర్ ద్వారా 3లక్షల ఆదాయం.. రాష్ట్రంలో 17వేలకు పైగా విలేజ్ ఆర్గనైజేషన్లు (వీఓ) ఉన్నాయి. అవి 3వేలకు పైగా కొనుగోలు కేంద్రాలను నడిపిస్తున్నాయి. సెంటర్ల నిర్వహణకు గానూ వీటికి క్వింటాల్​కు రూ.32 కమీషన్ వస్తోంది. ఈ లెక్కన ఒక్కో సీజన్​కు ఒక్కో కొనుగోలు సెంటర్ ద్వారా రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయం వస్తోంది. సంఘాలు ఈ డబ్బులను సభ్యులకు రూ.1.50 వడ్డీకి ఇచ్చి, రొటేషన్ ద్వారా ఆర్థికంగా ఎదుగుతున్నాయి. సగం సెంటర్లు ఐకేపీలవే.. రాష్ట్రంలో 6,391 కొనుగోలు కేంద్రాలు ఉండగా, సగందాకా ఐకేపీ సంఘాలు నిర్వహిస్తున్న సెంటర్లే ఉన్నాయి. రైతులు పంటలు అమ్ముకున్న 10 రోజులకే వారి ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. గతంలో వ్యాపారులకు అమ్ముకుంటే, నెలకు డబ్బులు ఇచ్చేవారు. మరోవైపు రైతులకు రవాణా భారం కూడా తగ్గింది. ఐకేపీ సెంటర్ల ఆదాయమూ  ఆ గ్రామాలకే దక్కుతోంది. ఆర్థికంగా పెద్ద దెబ్బ… కొనుగోలు సెంటర్లు ఎత్తేస్తే మహిళా సంఘాలకు ఆర్థికంగా దెబ్బే. కమీషన్ డబ్బులతో వస్తున్న ఆదాయంతో ఎవరైనా సభ్యులు కష్టాల్లో ఉంటే ఆర్థికంగా ఆదుకుంటున్నం. మా సంఘానికి  సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయం వస్తున్నది. సీఎం నిర్ణయంతో మహిళలు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. – విజయ, ఐకేపీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వాహకురాలు, మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా