ఆస్ట్రేలియన్ ఓపెన్‌‌‌‌‌‌‌‌ విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో జబెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఝలక్‌‌‌‌‌‌‌‌

ఆస్ట్రేలియన్ ఓపెన్‌‌‌‌‌‌‌‌ విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో జబెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఝలక్‌‌‌‌‌‌‌‌

మెల్‌‌‌‌‌‌‌‌బోర్న్‌ ‌‌‌‌‌‌‌:  ఆస్ట్రేలియన్ ఓపెన్‌‌‌‌‌‌‌‌ విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో సీడెడ్ ప్లేయర్లకు చుక్కెదురైంది. ఆరో సీడ్‌‌‌‌‌‌‌‌ ఆన్స్‌‌‌‌‌‌‌‌ జబెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎనిమిదో సీడ్‌‌‌‌‌‌‌‌ మారిక సాకరి  రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌లోనే ఇంటిదారి పట్టారు. బుధవారం జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో జబెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ట్యునీసియా) 0–6, 2–6తో 16 ఏండ్ల మిరా ఆండ్రీవా(రష్యా) చేతిలో వరుస సెట్లలో చిత్తయింది. 

మరో పోరులో సాకరి (గ్రీస్) 4–6, 4–6తో  ఎలినా అవనేస్యన్    (రష్యా) చేతిలో ఓడింది. నాలుగో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 7–6 (7/2), 6–2తో డొలెహిడె (అమెరికా)పై నెగ్గి మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌ చేరింది. మెన్స్ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌లో టాప్ సీడ్‌‌‌‌‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌‌‌‌‌ (సెర్బియా)  6–3, 4–6, 7–6 (7/4), 6–3తో  ఆస్ట్రేలియన్ అలెక్సీ పోపిరిన్‌‌‌‌‌‌‌‌ను ఓడించి మూడో రౌండ్ చేరాడు. నాలుగో సీడ్ సినర్, ఐదో సీడ్ రబ్లెవ్ కూడా ముందంజ వేశారు.