వర్సిటీని చెడగొడుతోంది వాళ్లే…

వర్సిటీని చెడగొడుతోంది వాళ్లే…

లెఫ్ట్ వింగ్ పై ప్రధానికి లెటర్ రాసిన 208 మంది వీసీలు, ప్రొఫెసర్లు

లెఫ్ట్ వింగ్ యాక్టివిస్టుల కారణంగా దేశంలోని ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్​లలో అకడమిక్ ఎన్విరాన్ మెంట్ దెబ్బతింటోందంటూ కొన్ని యూనివర్సిటీల వైస్ చాన్స్ లర్లతో సహా రెండువందల మందికి పైగా ప్రొఫెసర్లు ప్రధాని నరేంద్ర మోడీకి ఆదివారం లెటర్ రాశారు. స్టూడెంట్ పాలిటిక్స్ పేరిట యూనివర్సిటీల్లో అకడమిక్ కార్యక్రమాలకు అంతరాయం కలిగించేలా లెఫ్టిస్ట్ అజెండాను అనుసరిస్తున్నారని, జేఎన్​యూ నుంచి జామియా వరకు, ఏఎమ్​యూ నుంచి జాదవ్ పూర్ యూనివర్సిటీ క్యాంపస్ వరకు ఈ మధ్యే జరిగిన ఘటనలే అందుకు ఉదాహరణ అని లెటర్లో పేర్కొన్నారు. ‘విద్యాసంస్థలలో లెఫ్ట్ వింగ్ అరాచకానికి వ్యతిరేకంగా ప్రకటన’ పేరిట రాసిన ఈ లేఖపై సంతకం చేసిన వారిలో హరిసింగ్ గౌర్ యూనివర్సిటీ వీసీ ఆర్పీ తివారీ, సౌత్ బీహార్ సెంట్రల్ వర్సిటీ వీసీ రాథోడ్, సర్దార్ పటేల్ యూనివర్సిటీ వీసీ సిరీష్ కులకర్ణి ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. సిటిజన్​షిప్​ అమెండ్ యాక్ట్(సీఏఏ) పై కొన్ని యూనివర్సిటీల్లో స్టూడెంట్లు, మేధావుల నుంచి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో వర్సిటీల నుంచి మద్దతు కోసం 208 మంది వీసీలు, ప్రొఫెసర్లు ప్రధానికి ఈ లెటర్ రాసినట్లు తెలుస్తోంది.

సీఏఏపై లెఫ్ట్ –వింగ్ సెన్సార్​షిప్ కారణంగా వర్సిటీల్లో బహిరంగ చర్చలకు అవకాశం లేకుండా పోతోందని, సమ్మెలు, ధర్నాలు, బంద్​లు పెరిగిపోయాయని, వారికి సపోర్టు చేయనివాళ్లపై వేధింపులు ఎక్కువయ్యాయని లేఖలో పేర్కొన్నారు. లెఫ్టిస్ట్ రాజకీయాల వల్ల మెజారిటీ స్టూడెంట్లు వాళ్ల మంచి భవిష్యత్తును నిర్మించుకునే అవకాశాలను కోల్పోతున్నారని వివరించారు. అకడమిక్ ఫ్రీడం, వాక్ స్వేచ్ఛ, విభిన్న ఆలోచనల కోసం ప్రజాస్వామ్య శక్తులు కలిసి రావాలని తాము కోరుకుంటున్నట్లు మోడీకి లెటర్లో వివరించారు.