2. 25 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నరు: కేంద్రం

2. 25 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నరు: కేంద్రం

2011 నుండి 2022 వరకు మొత్తం 16 లక్షల మంది భారతీయులు తమ భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారు. గతేడాది అత్యల్పంగా 85,256 మంది పౌరసత్వాన్ని వదులుకోగా.. 2022లో అత్యధికంగా 2,25,620 మంది ఉన్నారని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. పార్లమెంటులో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఈ వివరాలను వెల్లడించారు. 2011 నుంచి 2022 వరకు ఎంత మంది తమ పౌరసత్వాన్ని వదులుకున్నారో నంబర్ తో సహా ప్రకటించారు.

ఆయన చెప్పిన ప్రకారం.. 2015లో1,31,489, 2016లో 1,41,603 మంది, 2017లో 1,33,049 , 2018లో1,34,561 కాగా, 2019లో 1,44,017 , 2020లో 85,256 , 2021లో 1,63,370,  2022 లో సంఖ్య 2,25,620 మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు. అలా మొత్తం ఈ 12ఏళ్ల కాలంలో భారత పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయుల సంఖ్య 16,63,440కి చేరిందని మంత్రి స్పష్టం చేశారు. దాంతో పాటు గత మూడేళ్లలో ఐదుగురు భారతీయులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పౌరసత్వాన్ని పొందారని చెప్పారు.135 దేశాల్లో భారతీయులు పౌరసత్వాన్ని పొందినట్టు కూడా ఆయన వెల్లడించారు.