చలో రాయ్బరేలీ .. ప్రచారానికి తరలిన తెలంగాణ నేతలు

చలో రాయ్బరేలీ ..  ప్రచారానికి తరలిన తెలంగాణ నేతలు

హైదరాబాద్: తెలంగాణ నేతలంగా రాయబరేలీ బాట పట్టారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయ్ బరేలీలో ప్రచారం చేయడానికి వెళ్లారు. నిన్న మంత్రి సీతక్క, రాజ్యసభ మాజీ సభ్యుడు వీహెచ్ రాయ బరేలీ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 3వ తేదీన రాహుల్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ నెల 20న రాయ్ బరేలీలో పోలింగ్ జరగనుంది. రాహుల్ ను ప్రధాన మంత్రిని చేయాలనే తలంపుతో ఉన్న కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడు యూపీ బాట పడుతున్నారు. 

ఇవాళ ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి  నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే  చిక్కుడు వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి , గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరిత , నాగర్ కర్నూల్  పార్లమెంట్ ఇంచార్జ్ మధుసూదన్ రెడ్డి,  నాగర్ కర్నూలు జిల్లా ఓబీసీ సెల్ ప్రెసిడెంట్ గిరి వర్ధన్ గౌడ్,  గద్వాల సీనియర్ నాయకులు తిరుపతయ్య బయలుదేరారు. 

త్వరలో సీఎం రేవంత్

రాయ్ బరేలి ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,  జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు పార్టీ ముఖ్య నాయకులు మధుయాష్కీగౌడ్, మహేశ్ కుమార్ గౌడ్, రాజ్యసభ ఎంపీలు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు రాయ్ బరేలీలో  ప్రచారం నిర్వహించనున్నారు.