అమెరికాలో కాల్పులు, ముగ్గురు మృతి

అమెరికాలో కాల్పులు, ముగ్గురు మృతి
వాషింగ్టన్‌: అమెరికాలోని ఇల్లినాయిస్‌ నగరంలో ఓ దుండగుడు తుపాకీతో రెచ్చిపోయాడు. క్రీడా మైదానంలోకి చొరబడి కాల్పులు జరపడంతో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు విడువగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గాయపడ్డవారిని హాస్పిటల్ కి తరలించారు. ఒక అనుమాతుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, కాల్పులు జరిగిన డాన్‌ కార్టర్‌  క్రీడా మైదాన ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు రాక్‌ ఫోర్డ్‌ సిటీ పోలీసులు.