సముద్రంలో చిక్కుకున్న 264 మంది జాలర్లు..

సముద్రంలో చిక్కుకున్న 264 మంది జాలర్లు..

ప్రతికూల పరిస్థితుల కారణంగా ఆరేబియా మహా సముద్రంలో చిక్కుకున్న 264 మంది మత్స్యకారులను ఇండియన్ కోస్ట్ గార్డ్ రక్షించింది. తమిళనాడు ఫిషరీష్ అథారిటీ నుంచి వచ్చిన సందేశాలతో ముంబైలో మారిటైమ్ రెస్క్యూ కో ఆర్డినేషన్ డిసెంబర్ 3న సహాయక చర్యలు ప్రారంభించింది. గోవాకు పశ్చిమాన 250 నాటికల్ మైళ్ల దూరంలో 50 ఫిషింగ్ బోట్లు చిక్కుకున్నట్లు గుర్తించిన ఐసీజీ ..వెంటనే ఆ ప్రాంతంలోని 7 వాణిజ్య నౌకలను అప్రమత్తం చేసింది. దీంతో 264 మందిని రక్షించాయి వాణిజ్య నౌకలు.

సముద్ర ప్రహారి, సమర్, సావిత్రిభాయ్ పూలే, అమల్, అపూర్వ లాంటి తీరగస్తీ నౌకలు సహా మరో 7 వాణిజ్య సంబంధ నౌకలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. గాయపడిన మత్స్యకారులకు వైద్య సహాయం అందించారు.