V6 News

స్పెషల్ లోక్ అదాలత్ లో 37 కేసులు పరిష్కారం

స్పెషల్ లోక్ అదాలత్ లో 37 కేసులు పరిష్కారం

అబిడ్స్, వెలుగు: తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల సేవా సంబంధిత కేసుల పరిష్కారానికి శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. హైకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్ కె.లక్ష్మణ్ ఆదేశాల మేరకు హైకోర్టు ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. హైకోర్టు న్యాయమూర్తి గాడి ప్రవీణ్ కుమార్ అధ్యక్షత వహించారు. మొత్తం 37 కేసులను పరిష్కరించారు. వీటిలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన 32 రిట్ పిటిషన్లు, రెండు రిట్ అప్పీలు ఉన్నాయి. సుమారు 41 మందికి ప్రయోజనం చేకూరేలా మూడు ఎంఏసీఎంఏ కేసులు కూడా  పరిష్కారమయ్యాయి.