గత ఆరు నెలల్లో 38 లక్షల మంది  ఔట్‌

గత ఆరు నెలల్లో 38 లక్షల మంది  ఔట్‌

బిజినెస్ డెస్క్‌‌‌‌, వెలుగు: లాక్‌‌డౌన్‌‌ టైమ్‌‌లో మార్కెట్‌‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఇన్వెస్టర్లకు రియాల్టీ తెలుస్తోంది. కిందటేడాది డిసెంబర్‌‌‌‌లో ఆల్‌‌టైమ్ హైని టచ్ చేసిన బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లు, ఆ లెవెల్‌‌ నుంచి పడుతూనే ఉన్నాయి. మొదట మిగిలిన ఆసియా మార్కెట్‌‌ల కంటే ఇండియన్ మార్కెట్‌‌లు ఖరీదుగా ఉన్నాయనే కారణంతో పడ్డాయి. ఆ తర్వాత కంపెనీల డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్‌‌ మెప్పించకపోవడం,  కిందటేడాది నవంబర్‌‌‌‌, డిసెంబర్‌‌‌‌ తగ్గిన ఇన్‌‌ఫ్లేషన్ తిరిగి జనవరిలో పెరగడం వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌‌ను దెబ్బతీశాయి. జనవరి చివరిలో అదానీ గ్రూప్‌‌పై హిండెన్‌‌బర్గ్ వేసిన బాంబ్ మొత్తం మార్కెట్‌‌నే కుదిపేసింది. బుల్‌‌ మార్కెట్ కనిపించకపోవడంతో కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్‌‌ను వీడుతున్నారని ఎనలిస్టులు పేర్కొన్నారు. సెబీ రిజిస్టర్డ్‌‌  ఎనలిస్ట్‌‌ అశిష్‌‌ బహెటీ ఈ విషయాన్ని ట్విట్టర్‌‌‌‌ ద్వారా పంచుకున్నారు.

ఎన్‌‌ఎస్‌‌ఈ డేటాను కోట్ చేస్తూ గత ఆరు నెలల్లో 38 లక్షల మంది యాక్టివ్‌ క్లయింట్లు స్టాక్ మార్కెట్‌‌ను వీడారని పేర్కొన్నారు. కిందటేడాది జూన్‌‌లో ఎన్‌‌ఎస్‌‌ఈలో యాక్టివ్ క్లయింట్లు 3.8 కోట్లు ఉండగా, ఈ ఏడాది జనవరిలో ఈ నెంబర్ 3.42 కోట్లకు తగ్గిందని చెప్పారు. ‘లాక్‌‌డౌన్ ట్రేడర్లకు రియాల్టీ కనిపించినట్టు ఉంది’ అని ట్వీట్ చేశారు. మరింత మంది ఇన్వెస్టర్లు మార్కెట్‌‌ను వీడుతారని ఆయన అంచనావేశారు. కిందటి నెల జెరోధా ఫౌండర్ నితిన్ కామత్ కూడా ఇలాంటి విషయాన్నే వెల్లడించారు. తమ  ప్లాట్‌‌ఫామ్‌‌లోకి కొత్త యూజర్లు రావడం సగానికి పైగా తగ్గిందని పేర్కొన్నారు. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో కొత్తగా ఓపెన్ అయిన అకౌంట్స్ 50 శాతం పడిపోయాయని అన్నారు. మొత్తం బ్రోకరేజి ఇండస్ట్రీలో పరిస్థితులు ఇలానే ఉన్నాయని వెల్లడించారు. 

ఎక్స్చేంజిల్లో ట్రేడింగ్ డౌన్‌‌..

ఎక్స్చేంజిల్లో క్యాష్ మార్కెట్‌‌ (షేర్లు) లో ట్రేడింగ్ తగ్గుతోంది.  కిందటేడాది నవంబర్‌‌‌‌లో  ఎన్‌‌ఎస్‌‌ఈలో   రూ.12,01,108 కోట్ల టర్నోవర్ జరగగా, ఈ నెంబర్‌‌‌‌ డిసెంబర్‌‌‌‌లో రూ.11,60,846 కోట్లకు, ఈ ఏడాది జనవరిలో రూ.10,20,626 కోట్లకు దిగొచ్చింది.  రోజు వారీ జరిగే టర్నోవర్ కూడా పడిపోయింది.   ఈ ఏడాది జనవరిలో సగటు డైలీ టర్నోవర్‌‌‌‌ రూ.48,601 కోట్లుగా రికార్డయ్యింది. ఇది కిందటేడాది డిసెంబర్‌‌‌‌లో రూ.52,766 కోట్లుగా, నవంబర్‌‌‌‌లో రూ. 57,196 కోట్లుగా  నమోదయ్యింది. కాగా,  టర్నోవర్ అంటే  ఆ రోజు కొన్న, అమ్ముడైన షేర్ల మొత్తం విలువ. మొత్తం క్యాష్ సెగ్మెంట్‌‌కు చెందిన మార్కెట్‌‌ క్యాప్  జనవరిలో రూ.12.17 లక్షల కోట్లు తగ్గి రూ.268.02 లక్షల కోట్లుగా రికార్డయ్యింది. కిందటేడాది డిసెంబర్‌‌‌‌లో ఇది రూ.280.19 లక్షల కోట్లుగా ఉంది. 

తగ్గుతున్నారు.. ఎందుకంటే?

ఇన్వెస్టర్లకు మార్కెట్‌‌‌‌పై ఆశ పోతోందని టర్టిల్‌‌ వెల్త్‌‌ సీఈఓ రోహన్‌‌ మెహతా పేర్కొన్నారు.   గత 20 ఏళ్ల నుంచి ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని, భారీ బుల్ రన్‌‌ తర్వాత  మార్కెట్‌‌లో  దీర్ఘకాలం పాటు కన్సాలిడేషన్ (డైరెక్షన్ కోసం రెడీ అయ్యే టైమ్‌‌)  కొనసాగుతుందని అన్నారు. ప్రస్తుతం  నిఫ్టీ 50 లేదా నిఫ్టీ 500 లో బుల్ రన్ పూర్తయి  16 నెలలు అవుతోందని చెప్పారు. బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లు ఇంకా హయ్యర్ లెవెల్లోనే కదులుతున్నప్పటికీ, బ్రాడ్ మార్కెట్ భారీగా నష్టపోయిందని అన్నారు.  ఏడాది గరిష్టాన్ని తాకిన ప్రతి షేరుకీ  52 వారాల కనిష్టాన్ని తాకిన తొమ్మిది షేర్లు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం మార్కెట్ ఎందుకు పడుతోందో ఆయన వెల్లడించారు.

‘మొదటి కారణం..కంపెనీల క్వార్టర్లీ రిజల్ట్స్ బాగోలేకపోవడం. రెండోది దేశ మార్కెట్‌‌ల వాల్యుయేషన్ ఎక్కువగా ఉండడం. మూడో కారణం అదానీ సంక్షోభం. మార్కెట్‌‌లో ఇన్వెస్టర్లను భయబ్రాంతులకు ఈ సంక్షోభం గురి చేసింది.  నాలుగోది కంపెనీల వ్యాపారాల్లో స్లోడౌన్ కనిపిస్తుండడం’ అని రోహన్ అభిప్రాయపడ్డారు. కన్సాలిడేషన్ టైమ్ పూర్తయ్యక మళ్లీ బుల్ రన్ స్టార్టవుతుందని అన్నారు. కానీ, అంత వరకు ఎంత మంది ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారో చెప్పాలేమని పేర్కొన్నారు. ‘చాలా మంది డబ్బులు సంపాదించడానికే మార్కెట్‌‌లోకి ఎంటర్ అవుతారు.  కొద్ది కాలానికే తమ గోల్ మరిచిపోయి ఫన్ కోసం చూస్తారు’ అని  రోహన్ అన్నారు. ఇన్వెస్టర్లు తమ ఫోర్టుఫోలియోని రివ్యూ చేసుకోవడానికి,  చెత్త షేర్లను వదిలించుకొని, క్వాలిటీ షేర్లను కొనుక్కోవడానికి ఇదే మంచి టైమ్ అని చెప్పారు.