జులై నెలాఖరుకు 418 మూవీ రిలీజ్..

జులై నెలాఖరుకు 418 మూవీ రిలీజ్..

దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో మైత్రీ  మూవీ మేకర్స్‌‌‌‌ సంస్థ నిర్మిస్తున్న హారర్ మూవీ ‘418’.  కీర్తన్ నాదగౌడ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్య రాజ్ వీరబత్తిని, హను రెడ్డి, ‘పతంగ్‌‌‌‌’ ఫేమ్ ప్రీతి పగడాల ప్రధాన పాత్రలు పోషించారు.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్న ఈ చిత్రాన్ని జులై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.  

భయంతో కూడిన గ్రామంలోని మెడికల్ కాలేజ్‌‌‌‌ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో సైన్స్, మూఢనమ్మకానికీ అర్ధం కాని ఒక సీక్రెట్‌‌‌‌తో, సరికొత్త  కథనాలతో గొప్ప సినిమాటిక్ ఎక్స్‌‌‌‌పీరియన్స్ ఇచ్చేలా ఈ చిత్రం ఉండబోతోందని మేకర్స్‌‌‌‌ తెలియజేశారు.  శ్రీ వైష్ణవ, శశాంక్ పాటిల్ ఇతర  కీలక పాత్రలు పోషించగా, వెంకీ జీజీ సంగీతం అందిస్తున్నాడు.