కోరుట్ల హోటళ్లలో ఇంటి సిలిండర్లు..48 సిలిండర్లు స్వాధీనం

కోరుట్ల హోటళ్లలో ఇంటి సిలిండర్లు..48 సిలిండర్లు స్వాధీనం
  • 25 మందిపై కేసులు

కోరుట్ల, వెలుగు:  జగిత్యాల జిల్లా కోరుట్లలో అక్రమంగా గ్యాస్ సిలిండర్ల నిల్వ, వినియోగంపై సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. కోరుట్ల పట్టణంలోని పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో తనిఖీలు చేపట్టిన అధికారులు డొమెస్టిక్​ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు అక్రమంగా వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా 48 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని 25 మందిపై కేసులు నమోదు చేసినట్లు సివిల్ సప్లై డీటీలు శ్రీనివాస్, ఉమాపతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గృహ వినియోగానికి కేటాయించిన సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాల

కోరుట్ల హోటళ్లలో ఇంటి సిలిండర్లు..48 సిలిండర్లు స్వాధీనం

కు ఉపయోగించడం చట్ట విరుద్ధమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న గ్యాస్ సిలిండర్లను గోదాముకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎఫ్‌ఐలు రాజేందర్, రాజేందర్‌రావు, స్వామి పాల్గొన్నారు